Medchal | తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి…

Medchal | తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి…

  • జలమండలి అధికారులను కలిసిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి..

Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగంగా మేడ్చల్ సర్కిల్ లో తాగునీటి సమస్యలపై ఇవాళ‌ జలమండలి అధికారులను, డీఈని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ… ప్రజల మౌలిక సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ముఖ్యంగా మేడ్చల్ ప్రాంత ప్రజలు తాగునీటి సమస్యతో నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా… డబుల్ బెడ్ రూముల ఇల్లు ఇవ్వలేదు, నీళ్ల సమస్యలను పట్టించుకోవడం లేదు, కరెంటు కోతలు, గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్యలు లేకుండా త‌మ ముఖ్యమంత్రి పాలన సాగించాడని ఆయన ఆరోపించారు. నీటి సమస్య పరిష్కరించకపోతే జలమండలి ఎండీని కలిసిన తర్వాత ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ‌ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply