Medaram | భక్తులకు కొంగు బంగారం

Medaram | భక్తులకు కొంగు బంగారం
Medaram | మేడారం ( మంగపేట ), ఆంధ్రప్రభ : జంపన్నవాగులో పుణ్యస్నానం అనంతరం వనదేవతలైన సమ్మక్క సారక్కల నామాలను జపిస్తూ మేడారం గద్దెల సమీపంలో కి చేరుకున్న భక్తులు అమ్మవారికి ప్రసాదమైన బంగారం ( బెల్లం ) కొనుగోలు చేస్తారు. మేడారం జాతర సందర్భంగా బెల్లం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో కిలో బెల్లం 60 రూపాయల నుండి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. బెల్లం రేటు ఎక్కువ ఉన్నా తల్లులకు మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు వెనుకాడటం లేదు.
