Medak | వెూగిన ఎన్నికల నగారా..

Medak | వెూగిన ఎన్నికల నగారా..
- మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణ
- డిసెంబర్ 11న తొలి విడత, 14న మలి విడత
- 17న మూడో విడత ఎన్నికలు నిర్వహణ
- ఉమ్మడి జిల్లాలో 1613 పంచాయతీలకు ఎన్నికలు
- ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు.. అమల్లోకి ఎన్నికల కోడ్
- ఎన్నికల సమరానికి సరుకు సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) :పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణ కొనసాగనుంది. డిసెంబర్ 11న తొలి విడత పంచాయతీ ఎన్నిలు ఉండగా.. 14న మలి విడత ఎలక్షన్ నిర్వహించనున్నారు. 17న మూడో విడత ఎన్నికలు నిర్వహణతో పంచాయతీ సమరానికి ముగింపు పలకనుంది. ఇందిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో 1613 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఇప్పటికే ఆయా పంచాయతీల వారీగా రిజర్వే షన్లు ఖరారు చేసిన విషయం తెలిసిం దే. వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రటించారు. నోటిఫికేషన్ వచ్చిందో లేదో పంచాయతీ ఎన్నికల సమరానికి సరుకు, సరంజామ సిద్ధం చేసుకుంటున్నట్టు ఆశావహులు చెప్పకనే చెబుతున్నారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులుగా ఎన్నిక వడానికి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు తహతహలాడుతున్నారు.
27 నుంచి మొదటి విడుత నామినేషన్లు..
మొదటి విడత ఎన్నికల నామినేషన్లు నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభ మవుతాయని ఎలక్షన్ అధికారులు పేర్కొన్నారు. రెండో విడత నామి నేషన్లు నవంబర్ 30వ తేదీ నుంచి మొదలు కానున్నట్టు వెల్లడించారు. ఇక మూడో విడతకు సంబంధించిన నామినేషన్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
ఎన్నికల రోజే ఫలితాలు..
అయితే పోలింగ్ ఉదయం ఏడు గం టల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. పోలిం గ్ ముగిసిన వెంటనే గంట విరామం తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు పెట్టనున్నట్టు తెలిపారు. లెక్కింపు పూర్తైన వెంటనే వివాదాలు ఏమీ లే కపోతే ఫలితాలు కూడా ప్రకటిస్తారని తెలిసింది. ఫలితాలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే ఎన్నికల అధికారు లకు లిఖిత పూర్వకంగా తెలియచేసే అవకాశం ఉంటు-ందని అధికారులు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా వివరాలు ఇవే..
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడు విడుదలగా గ్రామపంచాయతీ ఎన్ని కల సమరం కొనసాగానుంది. మొదటి విడతలో భాగంగా సంగా రెడ్డి నియోజకవర్గంలో మొత్తం 136 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో మొత్తం 12 46 వార్డులు ఉండగా మొత్తం పోలిం గ్ కేంద్రాలు 1246 ఉన్నట్టు తెలిపారు.
రెండో విడతలో ఆందోల్, జహీరా బాద్ నియోజకవర్గల్లో పంచాయతీ సమరం సాగనుంది. సెకండ్ విడత లో 243 గ్రామపంచాయతీ లకు, అట్లాగే 2164 వార్డులకు ఎన్ని కలు జరగనున్నాయి. ఇందుకుగాను 2164 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మూడో విడతలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలతో పాటు జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ లోని న్యాల్కల్ మండలంలోని పంచాయ తీలకు ఎన్నికలు నిర్వహించను న్నారు. మూడో విడతలో 234 పంచాయతీలకు గాను 1960 వార్డు లు ఉన్నాయి. అయితే 1960 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మెదక్ జిల్లాలోని ఎన్నికల వివరాలు ఇలా..
మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదక్ రెవెన్యూ డివిజన్లోని మొత్తం 160 గ్రామాలకు గాను 1402 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను 1402 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండో విడతలో భాగంగా తూప్రాన్, మెదక్ ప్రవీణ్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 149 గ్రామ పంచాయతీల్లోని 1290 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
మూడో పేజీలో భాగంగా నరసాపూర్ రెవెన్యూ డివిజన్లోని 123 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 1528 వార్డుల్లో అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఇది ఇలా ఉండగా మెదక్ జిల్లాలోని మొత్తం 492 గ్రామ పచాయతీల్లో 4220 వార్డులకు గాను 4220 ఎన్నికల కేంద్రాలను అధికా రులు ఏర్పాటు చేశారు.
సిద్దిపేట పంచాయతీల వివరాలు..
సిద్దిపేట జిల్లాలో 508 గ్రామాలు ఉన్నాయి. కాగా ప్రభుత్వం ఇచ్చిన తాజా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మొదటి విడతలో 163 గ్రామాలకు, రెండో విడతలో 182 గ్రామాలకు, మూడో విడుదల 163 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గ్రామాల వారిగా ప్రత్యేక షెడ్యూల్‌ను అధి కారులు విడుదల చేశారు.
