Sangareddy | నిబద్ధతతో పనిచేస్తేనే సార్ధకత

Sangareddy | నిబద్ధతతో పనిచేస్తేనే సార్ధకత

వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు


Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలోని ఆరోగ్యశాఖ కార్యక్రమాలను ప్రగతి పథంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు ముదిలి (Dr.Vasantha Rao Mudili) అన్నారు. శుక్రవారం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈసందర్భంగా డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు కలెక్టర్ పి.ప్రావిణ్య (Collector P. Pravinya) మార్గదర్శకత్వంలో ఎప్పటికప్పుడు శాఖపరమైన విధులను నిర్వర్తించేందుకు కృత నిశ్చయంతో ముందుకు వెళ్తానన్నారు. అలాగే జిల్లాలోని వైద్య సిబ్బంది అందరూ అహర్నిశలు పనిచేసి వైద్య ఆరోగ్య శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వృత్తిపై నిబద్దత ఉంటేనే విధులను సక్రమంగా నిర్వర్తించి సార్ధకత చేసుకునేందుకు వీలవుతుందని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply