మెదక్ : సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని, పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంఘం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజల్లో ఆయన సతీసమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమృత పుష్కరణలో జల లింగానికి పూజలు నిర్వహించి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర గర్భాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నీలం కు ఘన స్వాగతం పలికారు. పూజారులు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… ఆ పరమ శివుడు ఆశీస్సులతో ప్రజలంతా బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో రుద్రయ్య స్వామి, సృజన్ పాటిల్, శేఖర్ పాటిల్, నవాజ్ రెడ్డి, గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, బంటు శేఖర్, శివ, ఉత్సవా నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
