ప్రభుత్వ ఖాజీగా మౌలానా ఆరిఫ్

ప్రభుత్వ ఖాజీగా మౌలానా ఆరిఫ్

ఒంగోలు కల్చరల్, ఆంధ్రప్రభ : ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు డివిజన్ పరిధిలో ముస్లిం సామాజిక వర్గానికి నిఖా(Niqa) (వివాహాలు) జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి చెందిన మౌలానా షేక్ ఆరిఫ్ ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు రెవెన్యూ డివిజన్(Ongole Revenue Division) పరిధిలో ముస్లిం వివాహలు జరిపించేందుకు ఖాజీ (పురోహితులు)గా తనను సిఫార్సు చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు(Damacherla Janardhan Rao)ని మౌలానా ఆరిఫ్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాలు ఖాజీగా‌ విధులు నిర్వహించేందుకు తనను నియామకం చేసిందని మౌలానా ఆరిఫ్(Maulana Arif) తెలిపారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షేక్ కఫిల్ భాష, పఠాన్ హనీఫ్ ఖాన్, తెదేపా నగర మైనారిటీ నాయకులు పఠాన్ నాయబ్, షేక్ మస్తాన్ వలి, షేక్ అల్లా బక్షు, షేక్ సుల్తాన్, సయ్యద్ అల్లాబక్షు, పఠాన్, అహ్మద్ భాషా, షేక్ బాషా, ఖబరస్తాన్ కమిటీ కార్యదర్శి షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply