Math Day | ఘనంగా గణిత దినోత్సవం…

Math Day | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు, రామానుజన్ జయంతి పురస్కరించుకొని ఆయనకు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంగర్స్ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. రామానుజన్ గణితానికి చేసిన సేవలనుమరువలేనివని కొనియాడారు. రామానుజన్ సంఖ్య 1729 సంఖ్య యొక్క ప్రత్యకను వివరించారు. 15 ఏళ్లకే రామానుజన్ తనలోని తెలివితేటలను ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply