చిన్నస్వామిలో మ్యాచులు పునః ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium, Bangalore)లో మ్యాచ్​లు పునః ప్రారంభం కానున్నాయి. జూన్ 04న జరిగిన తొక్కిసలాట ఘటన తొలిసారి క్రికెట్ మ్యాచ్​ (cricket match)కు ఆతిథ్యం ఇచ్చేందుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధం అవుతోంది. దీంతో బెంగళూరు అభిమానులు కాస్త సంతోషపడుతున్నారు. కానీ, ఈ మ్యాచ్​లు చూసేందుకు ప్రేక్షకులకు మాత్రం స్టేడియంలోకి అనుమతి లేదు.

17ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025 ఐపీఎల్​ (IPL)లో ఆర్సీబీ టైటిల్ నెగ్గింది. దీంతో ఆర్సీబీ మేనేజ్​మెంట్ (RCB Management) జూన్ 04న విక్టరీ పరేడ్, చిన్నస్వామిలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్​కు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కారణాల వల్ల గత మూడు నెలల్లో అక్కడ మ్యాచ్​లు జరగలేదు. చిన్నస్వామిలో డొమెస్టిక్ లీగ్ మహారాజ టోర్నీ, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్​కప్​ (ICC Women’s ODI World Cup)లో పలు మ్యాచ్​లు జరగాల్సి ఉంది. కానీ, ఆయా కారణాల వల్ల మహారాజ టోర్నీని మైసూర్​కు మార్చగా, మహిళల వన్డే వరల్డ్​కప్​మ్యాచ్​లను నవీ ముంబయి(Mumbai)కి షిఫ్ట్ చేశారు.

Leave a Reply