అమెరికాలో భారీగా లేఆఫ్స్..

అమెరికాలో భారీగా లేఆఫ్స్..

అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు గరిష్ట స్థాయికి చేరాయి. 2024 అక్టోబర్ తో పోల్చుకుంటే 175 శాతం లేఆఫ్స్ పెరిగాయి. ప్రధానంగా కృత్రిమ మేథ (ఏఐ) దెబ్బకు లక్షల సంఖ్యలో ఉద్యోగాల పై కోతలు విధిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రతరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ పేరుతో వ్యయాలు తగ్గించుకోవాలన్నా.. పేరుతో కంపెనీలు భారీగా ఉద్యోగులును తొలగిస్తున్నాయి. అక్టోబర్ నెలలో 1,53,074 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయని 2003 తర్వాత అక్టోబర్ లో ఈ స్థాయిలో ఉద్యోగుల లేఆఫ్స్ జరగలేదని ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ తెలిపింది.

ఈ సంవత్సరం 10 నెలల కాలంలో ఇప్పటి వరకు 10 లక్షల మంది ఉద్యోగులకు కంపెనీలు ఉద్వాసన పలికాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఉద్యోగ కోతలు 65 శాతం పెరిగాయి. గడిచిన 20 సంవత్సరాల్లో ఒక్క నెలలోనే ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని ఈ సంస్థ పేర్కొంది. ప్రధానంగా ఏఐ వినియోగంతో ఉద్యోగాలు లక్షల సంఖ్యలో కోతకు గురవుతున్నాయి. కోవిడ్ తర్వాత కోలుకున్న అమెరికా జాబ్ మార్కెట్ తాజాగా ఏఐ దెబ్బకు మళ్లీ కుదేలవుతుందని ఈ సంస్థ పేర్కొంది. అక్టోబర్ లో ప్రధానంగా అమెజాన్, టార్గెట్ సంస్థలు ఏఐ వినియోగం మూలంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించాయి.

ఆర్గెట్ గ్రూపు 1800 మందిని అమెజాన్ 14 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. ఉద్యోగులను దశల వారిగా తొలగించడంతో పాటు వీరికి కొంత కాలం పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించడం మూలంగా తక్షణమే అమెరికా నిరుద్యోగం పెరుగుదల పై ప్రభావం చూపదని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అమెరికా షట్ డౌన్ మూలంగా అక్టోబర్ ప్రారంభం నుంచి అధికారిక ఆర్థిక గణంకాలు అందుబాటులో లేవు. వీటిలో నిరుద్యోగుల రేటు, నెలవారీ వేతనాల వృద్ది వివరాలు అందుబాటులో లేవు. కార్మిక శాఖ నుంచి ఉపాధి నివేదిక కూడా వెలువడదు. అందువల్ల అధికారికంగా అక్టోబర్ జాబ్ రిపోర్టును కార్మిక శాఖ విడుదల చేయలేదు. ఛాలెంజర్ రిపోర్ట్ తో పాటు ఏడీపీ కూడా పేరోల్ డేటాను విడుదల చేసింది.

Leave a Reply