మునోత్ లిథియంలో భారీ అగ్ని ప్రమాదం
- బ్యాటరీ మిషనరీ ముడి సరుకులు అగ్నికి ఆహుతి
- దాదాపు రూ.- 80 కోట్లు నష్టం
- ప్రమాదానికి కారణం సస్సెన్స్
ఏర్పేడు, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని విక్రతమాల(Vikratamala) సమీపంలోని మునోత్ కంపెనీ(Munoth Company)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గ్రూప్ లిథియం కంపెనీలో మంటలు వ్యాపించడంతో విధులు నిర్వహిస్తున్నసెక్యూరిటీ గార్డ్(Security Guard) పసిగట్టాడు.
వెంటనే కంపెనీలోని యాజమాన్యానికి తెలియజేయడంతో కార్మికులను అప్రమత్తం చేసి బయటకు పంపించేశారు. వెంటనే ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సేఫ్టీ రీజినల్ అధికారి భూపాల్ రెడ్డి(Bhupal Reddy) సంఘటన స్థలానికి చేరుకుని 6 ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కంపెనీలోని సెల్ ఫోన్ బ్యాటరీ చార్జర్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
దాదాపు 70- నుంచి 80 కోట్ల వరకు నష్టం జరిగినట్లు యాజమాన్యం(Owner) అంచనా వేశారు. ప్రమాదాన్నిగల కారణాలు క్లూస్ టీం సాయంతో పోలీసులు(Police) విచారణలో తేలుతుందని ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

