Marriguda | బ్రహ్మోత్సవాలకు వీధి దీపాల ఏర్పాటు..

Marriguda | మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి మొదలవుతాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజురైనా 58 వీధి లైట్లను బుధవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ కు రామదాసు శ్రీనివాస్ సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్ అందజేశారు. సర్పంచ్ భక్తుల శ్రేయస్సుకై వీది లైట్లను రాత్రి సమయంలో మెరుగైన వెలుగు సౌకర్యంకై మంజురైనా వీధి లైట్లను వెంటనే గ్రామంలోని ప్రధాన రహదారి, వీధుల్లో ఏర్పాటు చేశారు. అనంతరం వీధి లైట్లను మంజూరు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాస నీలిమచంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరం సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు పోనుగోటి శేఖర్, వార్డ్ సభ్యులు మహమ్మద్ జమీర్, జర్పుల హనుమంతు, సిలివేరు కల్పనరవి, తిరుమని అంజమ్మ, ఎస్టిసెల్ శ్రీను నాయక్, అమంచ రమేష్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
