Marriage | బాల్య వివాహ నిర్మూలనకు…

Marriage | బాల్య వివాహ నిర్మూలనకు…
Marriage | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : బాల్య వివాహాలు నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో రవి ప్రసాద్ పేర్కొన్నారు. బాల్య వివాహ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రథాన్ని ఎంపీడీవో రవి ప్రసాద్, ఉరవకొండ సి డి పి వో డాక్టర్ శ్రీదేవి జెండా ఊపి ప్రారంభించి, ప్రచార గోడపత్రికను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో రవి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాల్య వివాహం చట్టారీత్యా నేరం, బాల్య వివాహాలు చేస్తే రెండు సంవత్సరాలు జైలు,1 లక్ష రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ 100/112 ఉమెన్ హెల్ప్ లైన్ 181 నంబర్ కు ఉచితంగా ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
