Market Secretary Chamber | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం అధికారులు ఇష్టారీతిలో విధులకు హాజరవుతున్నారని, రైతులకు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఒకటి 1:10 గంటల సమయం అయినప్పటికీ కార్యాలయంలో మార్కెట్ సెక్రెటరీ చాంబర్ లో కుర్చీ ఖాళీగా ఉండటంతో పాటు సూపర్ వైజర్ కూడా మధ్యాహ్నం సమయం వరకు విధులకు రాకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోని అధికారులు ఇటీవలి కాలంలో విధులకు ఇష్టమైన సమయంలో హాజరు కావడం జరుగుతుందని, కొన్ని సందర్భాల్లో అధికారులు గైర్హాజర్ కూడా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులపై పర్యవేక్షణ లేని కారణంగా ఇష్టారీతిలో విధులకు హాజరు కావడం జరుగుతుందని… ఉన్నతాధికారులు స్పందించి పరకాల వ్యవసాయం మార్కెట్ కమిటీ కార్యాలయంలోని అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

