Maoists Call | 20న ఎపి తెలంగాణ బంద్ – పిలుపు ఇచ్చిన మావోయిస్ట్ లు

హైద‌రాబాద్ – కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆపరేషన్ కగార్‌ (operation kagar ) ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ (AP,Telangana ) రాష్ట్రాల బంద్ (bundh ) కు మావోయిస్టు (Maoists ) నేతలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల బంద్‌కు (Telugu states bandh) ప్రజలు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కాగా మావోయిస్టు నేతలు బంద్‌కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బలగాలు.. ఏఓబీ, తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులతో పాటు అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు. ఇరువైపుల వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Leave a Reply