Maoist | డీజీపీ ఎదుట నేడు సరెండర్

Maoist | డీజీపీ ఎదుట నేడు సరెండర్

Maoist | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలే పరిణామం చోటుచేసుకోనుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 30 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఇవాళ 30మందికి పైగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ లొంగుబాటు వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ అధికారికంగా వెల్లడించనున్నారు.

లొంగిపోనున్న వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన సభ్యులతో పాటు బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోధి కేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మావోయిస్టులు సుమారు 40 ఆయుధాలను పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ కూంబింగ్ ఆపరేషన్లు తీవ్రతరం కావడంతో ఒత్తిడికి గురైన మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల బలోపేతానికి ఇది దోహద పడుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply