Maoist | రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !!

Maoist | రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !!
- ఆసుపత్రిలో 13 మృతదేహాలు
- పోస్టుమార్టంలో వైద్యులు బిజీబిజీ
చింతూరు /మారేడుమిల్లి/రంపచోడవరం, ఆంధ్రప్రభ : అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలంలో జరిగిన వరస ఎన్కౌంటర్ల నేపథ్యంలో 13 మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరాయి. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల ఆరు మృతదేహాలను గంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఉన్న మార్చురీలో భద్రపరిచారు.
ఈ క్రమంలో చతిస్గడ్ రాష్ట్రం నుండి కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వర్గాలు ఆరు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక ఫ్రీజర్ బాక్స్ లలో మృతదేహాలను బంధువులకు అప్పగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మావోయిస్టు మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు చేర్చడానికి పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా, తన భార్య అయిన రాజేల మృతదేహలకు, దేవే మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అప్పగించారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన మరో ఎన్కౌంటర్ లో మృత్యువాత పడ్డ మావోయిస్టులను మార్చరికి తరలించడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మావోయిస్టు మృతదేహాలతో కిక్కిరిసిపోయింది.
