మావోయిస్టుల ఘాతుకం..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దారుణం చోటు చేసుకుంది. బీజాపూర్ (Bijapur) జిల్లా ఊసుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేల కాంకేర్ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులు కట్టం రవి, సోడి తిరుపతిని మావోయిస్టులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు పోలీసులకు సమాచారం అందిస్తున్నారని అనుమానంతో మావోయిస్టులు (Maoists) వారిపై దాడి చేసినట్లు వెల్లడించారు. భారత్ బంద్ పిలుపునిచ్చిన రోజున రాత్రి ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.

Leave a Reply