Maoism End  :    మావోయిజం అంతం

Maoism End  : మావోయిజం అంతం

  • మారేడుమిల్లిలో మరో ఎన్​ కౌంటర్​
  • ఏడుగురు మావోయిస్టులు మృతి
  • అగ్రనేతలు తిప్పరి..ఆజాద్​ మరణంపై అనుమానాలు?
  • క్లైమ్లాక్స్​ దశలో.. ఆపరేషన్​ కగార్​

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి )

Maoism End

అ.. అడవి, ఆ.. ఆయుధం  ఈ రెండు పదాలు తప్పా ఆదివాసీలకు తెలీదు.  శ్రీకాకుళంలో గిరిజన సాయుధ పోరాటం బీజంతో.. ఏర్పడిన పీపుల్స్​ వార్​ పార్టీ ఇక అంతరించినట్టే. అంటే మావోయిస్టు చరిత్రకు అతి త్వరలోనే తెరపడుతోంది. కీలక నేతలందరినీ అంతం చేసే దశకు కగార్​ ఆపరేషన్​ చేరింది. ఏపీ మారేడు మిల్లి అడవిలో .. కేంద్ర హోంశాఖకు కొరకరాని కొయ్యగా మారిన చత్తీస్​ గడ్​  ఏకైక గిరిజన మావోయిస్టు కీలక నేత మాడ్వి హిడ్మా తన భార్య రాజే, తన అత్యంత సన్నిహితులతో మృతి చెందిన కొన్ని గంటల్లోనే .. ఏపీలో పోలీసులు చెలరేగిపోయారు. ఏపీలోని షెల్టర్​ జోన్​ లో తలదాచుకున్న మావోయిస్టు పార్టీ యాక్షన్​ టీమ్​ ను అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే బుధవారం మావోయిస్టు పార్టీకి పిడుగులాంటి వార్త అందింది. మారేడుమిల్లిలో (Maredumilli)  మరో ఏడుగురు మావోయిస్టులు (Seven Maoists  Encounter) ఎన్​ కౌంటర్​ లో మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.

తాజా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి, మరో కీలక నేత ఆజాద్​ మృతి చెందినట్టు కబురు వైరల్​ అవుతోంది. నిజానికి మంగళవారమే తిప్పరి తిరుపతిని, మరో 12 మంది అంగరక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మీడిమాలో ప్రచారం జరిగింది. కానీ విజయవాడలో బుధవారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఏపీ ఎడిషనల్​ డీజీ మహేష్​ లడ్డా మాట్లాడుతూ.. తిప్పరి తిరుపతి ఇంకా దొరకలేదు, అతడి జాడ కోసం గాలిస్తున్నాం, అని స్పష్టం చేశారు.

ఇక హిడ్మా ఎన్​ కౌంటర్​ పైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కగార్​ ఆపరేషన్​ తారా స్థాయికి చేరిన తరుణంలో.. బిడ్డ లొంగిపో,,జనంలో కలిసి పో అని హిడ్మా తల్లి విలేఖరుల సమావేశంలో వేడుగకుంది. తల్లి మాట ప్రకారమే.. లొంగుబాటను ఎంచుకున్న హిడ్మా దండకారణ్యాన్ని వీడి ఏపీలోని షెల్డర్​ జోన్​ కు చేరుకోగా.. కీలక సమాచారంతో పోలీసులకు దొరికిపోయాడని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. హిడ్మాను తాము పట్టుకోలేదని, అతడే మారేడుమిల్లి అడవిలో మకాం వేశాడని, ఎదురు కాల్పులకు దిగి చనిపోయాడని ఏపీ అడిషనల్​ డీజీ మహేశ్​ లడ్డా స్పష్టం చేశారు.

Maoism End  : మావోయిస్టు అగ్రనేతల  మటాష్​

2026 మార్చి 31 డెడ్​ లైన్​. (Dead Line). అడ్వాన్స్​ గా క్లైమాక్స్ (Advance ClimaX) ​ దశకు చేరింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్​ భూపతి, మరో కీలక నేత వాసుదేవరావు ఆయుధాలు సహా తన పటాలంతో లొంగిపోయిన వెంటనే.. ఆపరేషన్​ కగార్​ (Operation) అంతిమ స్థితికి చేరిందని .. దండకారణ్యంలో గిరిజనులు ఓ నిర్ణయానికి వచ్చారు. మరో ఇద్దరు బండి ప్రకాష్​, చంద్రన్న  ఆయుధాలు లేకుండా లొంగిపోయారు.  ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు (Mallojula Venugopal, Asanna0 , వాసుదేవరావు పదే పదే .. లొంగిపోండి..లేదో చస్తారు, అని ప్రకటనలు జారీ చేస్తున్నారు. లొంగిపోయే మావోయిస్టులు తమకు సమాచారం ఇవ్వాలని ఫోన్​ నెంబర్​ కూడా విడుదల చేశారు.

Maoism End  : విజయవాడలో ఏం జరిగింది?

దండకారణ్యంలో  మల్లోజుల , ఆశన్న  లొంగిపోవటంతో… మావోయిస్టు పార్టీ కీలక సమాచారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఆయుధాలు సమర్నించిన ఈ నేతలు.. మొత్తం పార్టీ సమాచారం లీక్​ చేస్తారని పసిగట్టిన మావోయిస్టు అగ్రనేతలు అలెర్ట్​ అయ్యారు, తమ యాక్షన్​ టీమ్​ ల కోసం ఏపీలో షెల్డర్​ జోన్​ లు ఏర్పాటు చేశారు. కానీ.. అలా లొంగుబాటు ప్రస్తానానికి ముందే ఏపీ పోలీసులు ముందస్తు ప్లాన్​ సిద్ధం చేశారు. గతంలో ఎక్కడెక్కడ మావోయిస్టుల మూలాలు ఉన్నాయో? వెనక్కి తీశారు. ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. పోలీసుల ప్లాన్​ సక్సెస్​ అయింది.  ఏపీ  పోలీస్ నిర్వహించిన షెల్డర్​ ఆపరేసన్​ లో 27 టార్గెట్​ లో ఉన్నారు. వీరిలో హిడ్మా సౌత్ బస్టర్ కమిటీ ( South Bastar committee),   లోకల్ కారిడార్ ఆఫ్ చత్తీసగఢ్ కమిటీల సభ్యులు ( Local Carridor oF Chattisgarh)  ఉన్నారు.

ఈ సమాచారం ఏపీ పోలీసులకు క్షుణ్ణంగా చేరింది.  ఇక మావోయిస్టులపై   పై నిఘా పెట్టారు. కార్యకలాపాల్ని పసిగట్టారు. కానీ దాడులు చేయలేదు.   పూర్తి సమాచారంతో అన్నీ సెట్ చేసుకుని ఏకకాలంలో  పట్టేశారు . విజయవాడ, ఏలూరు, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లోని షెల్డర్ జోన్లపై (Shelter Xones)  నిఘా పెంచారు. మంగళవారం హిడ్మా ఎన్​ కౌంటర్ (Hidma Encour) ​ తరువాత  .. అతడి మరణ వార్త తెలియగానే ఏపీలో తలదాచుకున్న మావోయిస్టులు మకాం మార్చే అవకాశం ఉందని ముందుగానే భావించిన పోలీసులు డ్రోన్లను (Drone)  ప్రయోగించి మరీ 50 మంది పీజీఎల్​ ఏ యాక్షన్​ టీమ్​ ను పట్టేశారు. వీరి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు 

ఏపీ  చరిత్ర లో ఈ ఆపరేషన్ (Operation) ​ లో  కీలక నేతలను  పట్టుకోవడం ఇదే ప్రథమం.   కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను అదుపులోకి తీసుకున్నారు.  వీరిలో తిప్పరి తిరుపతి (Tippari Tirupati) , ఆజాద్​ సహా 12 మంది చిక్కారని మంగళవారం సాయంత్రమే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఈ నాలుగు ప్రాంతాల్లో దొరికిన చత్తీస్​ గడ్​ యాక్షన్​ టీమ్ (Action Team) ​ నుంచి  45 (Wepons) ఆయుధాలు, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్ (Magzine)  లు ,  750 గ్రాముల వైర్,  ఇతర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు.

Maoism End   ఇక దేవ్​ జీ స్థితే సస్పెన్స్​ …

Maoism End

మంగళవారమే అదుపులోకి తీసుకున్న 12 మంది కీలక మావోయిస్టులను మళ్లీ ఏజెన్సీకి తరలించి.. వీరిలో ఏడుగుర్ని ఎన్​ కౌంటర్​ చేశారని పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ పన్నెండు మందిలో  దేవ్​ జీ ( Dev ji) , ఆజాద్ (Azad) ​ ఉన్నారని చెబుతున్నారు. కానీ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వీరిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇంతకీ ఈ ఏడుగురు ఎవరు? వీరిలో తిప్పరి తిరుపతి ఉన్నాడా? లేడా? ఆజాద్​ సంగతేంటీ? మరో వైపు ఏవోబీలో పోలీసులు (Police Alert)  అలెర్ట్​ అయ్యారు.

అడవిని జల్లెడ పడుతున్నారు. గిరిజన వాడలపై ఫోకస్​ పెట్టారు. ఎందుకంటే.. ఈ ఎన్​ కౌంటర్​ నుంచి మరి కొందరు తప్పించుకున్నారని. (Escaped)  వీరి కోసం జల్లెడ పట్టామని పోలీసులు చెబుతున్నారు. ఎనీ హౌ .. కగార్​ ఆపరేషన్​.. తుది దశకు చేరింది. ఇక జన స్రవంతిలో భూపతి, ఆశన్న హవా (Bhupathi , Asanna)  తెరమీదకు రావటం ఖాయమని గిరిజనులు గుసగుసలాడుతున్నారు. మరో వైపు మావోయిసక్టు బీఆలతో పోరుబాటలో నడిచిన ఆదివాసీలు సైతం తమ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply