రాజ‌మౌళికి ప‌లువురి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

రాజ‌మౌళికి ప‌లువురి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి నేడు 52వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో రాజమౌళికి విషెస్ తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి.. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అద్భుతాలే అంటూ.. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రాబోతుంది అని మహేష్ బాబు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు జక్కన్న అంటూ ‘లోడ్స్ ఆఫ్ లవ్’ అండ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో విషెస్ తెలిపాడు. అలాగే రామ్ చరణ్ తేజ కూడా దర్శక ధీరుడు రాజమౌళికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మా రోజుల్లో అతిపెద్ద ఫిలిం మేకర్, దగ్గరి వ్యక్తి అయిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలిపారు.

Leave a Reply