Manthani | మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి మృతి

Manthani | మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి మృతి
Manthani | మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాదులోనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పై ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఉత్తర మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం మంథనిలో స్థిరపడ్డారు. రేపు సాయంత్రం ఆయన భౌతిక కాయాన్ని మంథనికి తీసుకుని వస్తున్నట్లు సమాచారం. ఆయన చిన్న కుమారుడు అమెరికా నుండి రావాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
