విజయం దిశగా కమలం పార్టీ

విజయం దిశగా కమలం పార్టీ
బోయిని నారాయణ గెలుపు ఖాయం అంటున్న స్థానికులు
మంథని: బిజెపి పార్టీ నుంచి బోయిన్ నారాయణ ఐదో వార్డ్ కౌన్సిలర్ గా బరిలో ఉన్నారు. పెద్దపెల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సహకారంతో పోటీలో ఉన్నానని, వార్డు ప్రజలంతా ఆశీర్వదించి కమలం పువ్వుకు ఓటేయాలని ఆయన కోరారు. స్థానికుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. మంథని మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే, ఐదో వార్డును మున్సిపల్ లోనే అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వార్డు ప్రజల కుటుంబంలో సభ్యుడిగా ఉంటానని ఒక్కసారి ఆశీర్వదించి ఓటెయ్యాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించే ధ్యేయంగా పరిపాల అందిస్తానని ఆయన వివరించారు.
