Mango Farmer | నారా లోకేష్‌కు వినతి పత్రం

Mango Farmer | నారా లోకేష్‌కు వినతి పత్రం

  • రూ. 8 బకాయిలు చెల్లించని గుజ్జు ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Mango Farmer | చిత్తూరు, ఆంధ్రప్రభ : ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులకు రావాల్సిన రూ. 8 బకాయిలు ఇతర కీలక సమస్యల పరిష్కారం కోసం మామిడి రైతు సంఘం నేతలు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను (Nara Lokesh) కలసి వినతి పత్రం అందజేశారు. నారావారిపల్లెలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మామిడి రైతు సంఘం అధ్యక్షులు సి. మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన మంత్రి నారా లోకేష్‌ను కలసి రైతుల సమస్యలను వివరించారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం ధిక్కరించి గుజ్జు ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన రూ. 8 బకాయిలను ఏడునెలలుగా నిలిపివేస్తూ రైతులను దోచుకుంటున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుజ్జు ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రూ. 8 బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, మామిడి రైతు సంఘం నేతలతో కలిసి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత మామిడి సీజన్‌లో (Season) పురుగు మందుల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కంపెనీలు, డీలర్లపై ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నకిలీ మందుల విక్రయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

గత సంవత్సరం మామిడి పంటలో నష్టపోయిన రైతులకు ఈ ఏడాది పురుగుమందులు 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వమే నేరుగా అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మామిడి సాగుకు అనుసంధానం చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న చిత్తూరు మామిడిని, రైతులను (Farmer) కాపాడాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతు సంఘం నేతలు మునిరత్నం నాయుడు, ఉమాపతి నాయుడు, జయదేవయ్య తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ సంబరాలు..

CLICK HERE TO READ MORE

Leave a Reply