Manchester | అరుదైన క్రీడా కలయిక.. అభిమానులకు కనుల విందు !

  • అడిడాస్ మ్యాజిక్.. ఒకే వేదికపై రెండు జట్లు
  • ఒకే మైదానంలో క్రికెట్ వీరులు, ఫుట్‌బాల్ దిగ్గజాలు
  • జెర్సీలు మార్చుకుని ఫోజిలిచ్చిన‌ ఆటగాళ్లు

మాంచెస్టర్ : క్రీడా ప్రపంచంలో ఓ అపూర్వ కలయిక ఈరోజు అభిమానులను అబ్బురపరిచింది. భారత క్రికెట్ జట్టు(Indian cricket team), ప్రీమియర్ లీగ్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ (Manchester United Football Club) ఒకే వేదికపై చేరి, ఆటను ఒక స్నేహపూర్వక వేడుకగా మార్చాయి. రెండు జట్లకు ఉమ్మడి స్పాన్సర్‌గా ఉన్న అడిడాస్ (Adidas) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అభిమానులకు ఒక క్రీడా విందుగా మలిచింది.

జూలై 23న ఓల్డ్ ట్రాఫోర్డ్ (Trafford) వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య‌ జరుగనున్న కీలక నాల్గవ టెస్ట్‌((India – England fourth Test)కు ముందు ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు ఫోటోషూట్‌లు, సరదా సంభాషణలు, స్నేహపూర్వక ఆటలతో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.

ప్రధానంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(Shubhman Gill), మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్ బ్రూనో ఫెర్నాండెజ్ (Bruno Fernandes) జెర్సీలు మార్చుకుని ఫోటోలు దిగడం అభిమానులను ఆకట్టుకుంది. ఇతర ఆటగాళ్లు కూడా జెర్సీలు మార్చుకుని ఆట స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ ఫోటోలు కొద్ది సేపులోనే సోషల్ మీడియా అంతటా వైరల్ (Viral across social media) అయ్యాయి.

భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) — యునైటెడ్ డిఫెండర్ హ్యారీ మాగ్వైర్‌(Harry Maguire)కు కొన్ని బంతులు వేయగా, మాగ్వైర్ బ్యాట్ పట్టుకుని సరదాగా నెట్‌ సెషన్‌లో పాల్గొని అందరినీ అలరించాడు. అదే సమయంలో రిషబ్ పంత్ (Rishabh Pant) తన ఫుట్‌బాల్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ యునైటెడ్ గోల్‌కీపర్ టామ్ హీటన్ (Tom Heaton) గోల్‌లోకి కొన్ని పెనాల్టీ కిక్‌లు కొట్టి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ లాంటి యువ ఆటగాళ్లు యునైటెడ్ క్యాంప్‌కి వెళ్లి జెర్సీలపై సంతకాలు చేసి, ఫోటోలకు పోజులిచ్చి, కోచింగ్ సిబ్బందితో సరదాగా చాటింగ్ చేశారు.

రెండు జట్ల ఆటగాళ్లు ఒకరి జెర్సీలు మరొకరు ధరించి తీసుకున్న గ్రూప్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానులకు క‌న్నుల‌పండువ‌గా మారిన ఈ దృష్యాలు… అభిమానుల‌ హృదయాల్లో నిలిచిపోయే క్షణాలుగా మారుతున్నాయి.

Leave a Reply