బోనాలతో మహిళల ఊరేగింపు

బోనాలతో మహిళల ఊరేగింపు
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం,పొనకల్ వడ్డెర సంఘం ముఖ్య నేతల ఆధ్వర్యంలో మహిళలు గురువారం బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. స్థానిక రామాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా మండల కేంద్రంలోని గుట్ట మైసమ్మ దేవాలయం వరకు డప్పుల చెప్పుల మధ్య నృత్యాలు చేస్తూ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా రెండు గ్రామాల వడ్డెర సంఘం ముఖ్య నేతలు, పొనకల్, జన్నారం, కామనపల్లి సర్పంచులు జక్కు సుష్మ- భూమేష్, అజ్మీర కళావతి-నందునాయక్, పేరం శ్రీనివాస్, హరిహర భారత్ గ్యాస్ యజమాని మిక్కిలినేని రాజశేఖర్ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
