Mancherial | జిల్లాలో మున్సిపల్ పోరు

Mancherial | జిల్లాలో మున్సిపల్ పోరు
- ఉదయం 9 గంటలకే 11.18 శాతం ఓటింగ్ నమోదు!
Mancherial | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా సగటున 11.18 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని 149 వార్డుల పరిధిలో ఉన్న 444 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన ఓటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి:
చెన్నూరు: 14.83% (జిల్లాలోనే అత్యధికం)
లక్షెట్టిపేట: 14.30%
క్యాతన్‌పల్లి: 13.92%
బెల్లంపల్లి: 12.44%
మంచిర్యాల కార్పొరేషన్: 9.71% (అత్యల్పం)
మొత్తం 2,94,297 మంది ఓటర్లకు గానూ, ఉదయం 9 గంటల వరకు 32,905 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషుల ఓటింగ్ శాతం 11.78% (17,129 ఓట్లు) కాగా, మహిళల ఓటింగ్ శాతం 10.60% (15,776 ఓట్లు) గా నమోదైంది. మధ్యాహ్నం సమయానికి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎన్నికల యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది.
