Mana Shankara Vara Prasad Garu | జనవరి 12న రిలీజ్..

Mana Shankara Vara Prasad Garu | జనవరి 12న రిలీజ్..

Mana Shankara Vara Prasad Garu, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ల పై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్(A grand event) ని నిర్వహించారు. మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్ల(In theaters on January 12th)లో విడుదల కానుందని అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాం. ఈ సినిమాని మేలో మొదలుపెట్టాం. మెగాస్టార్ తో ఈ మూవీ షూటింగ్(Movie shooting) స్టార్ట్ చేశాం. అక్కడ్నుంచి ఈ ఏడు ఎనిమిది నెలలో జర్నీ నాకు చాలా మెమొరబుల్. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే అయిపోయినా.. నేను ఇంకా ఆ ఎమోషన్ లోనే ఉన్నాను. మేమిద్దరం కూడా ఒక మంచి మెమోరియల్ జర్నీగా షేర్ చేసుకున్నాం. ఒకరినొకరు మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇద్దరిలో ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ కి థాంక్యూ(Thank you Megastar) సో మచ్. సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు ఇది నా నాలుగో సంక్రాంతి. నాకెప్పుడూ సంక్రాంతి అంటే ఒత్తిడి ఉండదు .హాలిడేస్ లో సరదాగా ఇంటికి వెళ్లి పండగ పూట థియేటర్స్ కి వెళ్లి ఒక మంచి ఎంటర్టైర్నర్ ని చూసే ఒక ఎనర్జీ లాగా ఫీల్ అవుతాను.

Mana Shankara Vara Prasad Garu

Mana Shankara Vara Prasad Garu | అప్డేటెడ్ వెర్షన్ తో మన ముందుకు..

అందుకే సంక్రాంతి ఎప్పుడు కూడా నా కెరియర్లో(in career) చాలా ప్రత్యేకం. లాస్ట్ సంక్రాంతికి మీరు ఎంత ఎనర్జీతో ఎంజాయ్ చేశారో, అలాంటి ఎంజాయ్మెంట్ ఈ సంక్రాంతి కూడా మీకు దొరకపోతుంది. మెగాస్టార్ ఫన్ టైమింగ్ ఏంటో ఒక జనరేషన్ విట్నెస్ చేసింది. ఈ జనరేషన్ కి ఒక అప్డేటెడ్ వెర్షన్(Updated version) తో చిరంజీవి మన ముందుకు రాబోతున్నారు. చాలా ఫన్, డ్యాన్సులు, యాక్షన్ అన్నీ చాలా బాగా కుదిరాయి. ఈ సంక్రాంతికి సూపర్ ఎంటర్టైనర్ ఇది. వెంకటేష్ నాకు చాలా ప్రత్యేకమైన హీరో. ఆయన నా గురువు, మెంటర్. ఈ వేడుక ఆయన బర్త్ డే రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఆయన ఇరవై నిమిషాల బ్లాక్ చేశారు. చిరు, వెంకీలతో పాటు ఉంటుంది. వీరిద్దరి సినిమాలను దశాబ్దాలుగా మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఇద్దరినీ ఒక ఫ్రేమ్ లో చూడాలనేది సినీ లవర్స్(Cine lovers) కి ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి అవకాశం నాకు దొరికింది. వీరిద్దరూ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మీకు చూపించడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను.

ఈ సినిమాలో నటించినందుకు వెంకటేష్ కి థాంక్యూ. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవత్ కేసరి(Bhagwat Kesari) తర్వాత సాహూతో ఇది నాకు రెండో సినిమా. చాలా ఫ్రెండ్లీగా పని చేస్తాం. సుస్మిత చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చిరంజీవి డాటర్ అనే ఫీలింగే ఉండదు. షూటింగ్స్ స్పాట్లో అందరితో చాలా సరదాగా కలిసిపోతారు. ఈ సంక్రాంతి సుస్మితకి మరింత మెమొరబుల్ గా ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాంతో పోల్చుకుంటే స్టోరీ పరంగా కొంచెం డెప్త్ ఉన్న సినిమా ఇది. ఫన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు బ్యూటిఫుల్ ఎమోషన్(Beautiful emotion) ఉంటుంది. చిరంజీవి, నయనతారకి, అలాగే ఇందులో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్లకి చిరంజీవికి వుండే ఎమోషన్ చాలా కనెక్టింగ్ గా వుంటాయి. ఎంటర్టైన్మెంట్ తో పాటు అద్భుతమైన డ్రామా(Excellent drama) ఉంటుంది. చిరంజీవిని ఆడియన్స్, ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో అలా చూపించడానికి 100% ఎఫర్ట్ పెట్టాను. ఆడియన్స్ కి ఆయన విపరీతంగా నచ్చుతారు అన్నారు.

Mana Shankara Vara Prasad Garu

CLICK HERE TO READ అఖండ 3 నిజంగా ఉంటుందా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply