సీఎం ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజుల లొంగుబాటు
ఆయన బాటలో 60 మంది సాయుధులు
పెద్దపల్లి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర సీఎం దేవందర్ ఫడ్నవీస్ (Maharashtra CM Devendra Fadnavis) సమక్షంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ రీజినల్ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు (Mallojula Venu Gopal Rao) అలియాస్ అభయ్ లొంగిపోయారు. ఆయన బాటలో మరో 60 మంది సాయుధులు కూడా ఆయుధాలు అప్పగించారు.

నిన్న మహారాష్ట్ర లోని గడ్చిరోలి పోలీసుల వద్దకు చేరిన అరవై మంది సాయుధాలతోపాటు మల్లోజుల వేణుగోపాలను సీఎం ఫడ్నవీస్ వద్దకు తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం సీఎం ఎదుట వారు లొంగిపోయారు. లొంగిపోయిన మల్లోజుల పెద్దపల్లి పట్టణానికి చెందిన వాసి.

లొంగిపోయింది వీళ్లే!
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : మహారాష్ట్ర సీఎం దేవందర్ ఫడ్నవీస్ సమక్షంలో మాయివోస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌తోపాటు అరవై మంది తమ ఆయుధాలను వీడి ఈ రోజు లొంగిపోయారు. లొంగిపోయిన వారి జాబితాను పోలీసులు విడుదల చేశారు.


