Mallareddy | నా నియోజకవర్గాన్ని నిర్లక్షం చేయొద్దు

Mallareddy | నా నియోజకవర్గాన్ని నిర్లక్షం చేయొద్దు

Mallareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: శ్రీధరన్నా… నామీద పగపట్టొదన్నా… నా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వేడుకుంటున్నా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో మోరీలు లేవు, రోడ్లు లేవు, నా నియోజకవర్గాన్ని నిర్లక్షం చేయొద్దన్నారు. నేను అక్కడ ఉండలేకపోతున్నానన్నారు. నేను ఎందుకు గెలిచానా అనిపిస్తోందన్నారు. నీకు దండం పెడతానన్నా… నువ్వు ఒక్కసారి రావాలన్నా అని మంత్రి శ్రీధర్ బాబును వేడుకున్నారు. నా మీద మీరు కుట్రలు పన్నుతున్నారన్నారు. స్పెషల్ కేటగిరీ కింద అభివృద్ధి చేయాలన్నారు.

Leave a Reply