Makthal | వైభవంగా మహాశివరాత్రి జాగరణ..

Makthal | వైభవంగా మహాశివరాత్రి జాగరణ..

Makthal, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన శ్రీ క్షేత్ర శ్రీ వల్లభాపురం దత్త క్షేత్రంలో మహా శివరాత్రి జాగరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి 10 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు వల్లభాపురం దత్త క్షేత్రంలో జాగరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

టీవీ షోలలో ప్రముఖంగా కొనసాగుతున్న జబర్దస్త్ ఫేమ్ కొమరక్క, పావనితో పాటు ప్రముఖ జానపద కళాకారుడు జంగి రెడ్డి బృందం ఆటపాట సాంస్కృతి కార్యక్రమాలు ప్రజలను ఉర్రుతలూగించాయి. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు నిరంతరంగా కొనసాగిన సంస్కృత కార్యక్రమాలను ప్రజలు వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. జంగి రెడ్డి జానపద గీతాలు ఉర్రూతలూగించాయి. అదే విధంగా కొమరక్క, పావని కామెడీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply