Makthal : గ‌తంలోనూ… రానున్న రోజుల్లో…

Makthal : గ‌తంలోనూ… రానున్న రోజుల్లో…

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామంలో బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి(Gavinolla Balakrishna Reddy) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari) పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం నేరడగొం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పంచమశిద్దలింగ మహాస్వామితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రి(Yashoda Hospital) వైద్యులను ఇక్కడికి తీసుకువచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులను సైతం ఉచితంగా అందించడం అభినందనీయం అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని మంత్రి వాకిటి శ్రీహరి బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవినోళ్ల రాధా లక్ష్మారెడ్డి(Gavinolla Radha Lakshma Reddy), వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్,మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మా రెడ్డి, సంగంబండ మాజీ సర్పంచులు జి.బాల్ రెడ్డి, కేశవరెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply