Makthal | నియామకం…

Makthal | నియామకం…

  • తత్వవాద తెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకుడిగా విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉడిపి పెజావర మఠాధీశ్వరులు పూజ్య విశ్వతీర్థ స్వామి ఆధ్వర్యంలో అఖిల భారత మాధ్వ మండలి అనే సంస్థ ద్వారా కొనసాగుతున్న తత్వవాద తెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకులుగా మక్తల్ పట్టణానికి చెందిన విద్వాన్ కే. రాఘవేంద్ర ఆచార్య నిరమితులయ్యారు .ఈ మేరకు ఉడిపి పెజావల పటాదీశ్వరులు విశ్వతీర్థ స్వామి రాఘవేంద్ర ఆచార్యకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దేశం నలుమూలల అఖిలభారత మాధ్వ మండలి అనే సంస్థను స్థాపించి ఈ మండలి ఆధీనంలో తత్వవాద మాసపత్రికను కొనసాగిస్తున్నామన్నారు. తెలుగులో గత 50 ఏళ్లుగా ఈ మాసపత్రిక కొనసాగుతుందన్నారు. 50 ఏళ్లుగా సనాతన ధర్మ జగద్గురు శ్రీ మద్వాచార్యుల సందేశాలను భక్త మహాశయులకు అందిస్తూ వస్తుందని అన్నారు. 25 ఏళ్లుగా ప్రధాన ప్రధాన సంపాద‌కుడిగా కొనసాగుతున్న బీఈ.నాగేంద్ర ప్రసాద్ ఆచార్య నుంచి తన ప్రియ శిష్యులు కె.రాఘవేంద్ర ఆచార్య ను ప్రధాన సంపాదకులు గా నియమిస్తున్నట్లు ప్రకటించారు .

కార్యక్రమంలో పలువురు జగద్గురువులు పాల్గొన్నారు. తత్వవాద తెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకులుగా ఎంపికైన విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాత ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసే కార్యంలో నా వంతు కృషి చేస్తానన్నారు .జగద్గురుల ఆశీస్సులతో తత్వవాద మాసపత్రికను తెలుగునాట ఇంటింటికి చేరవేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు .తనపై నమ్మకంతో ప్రధాన సంపదడిగా బాధ్యతలు అప్పజెప్పిన మఠాధీశ్వరులు విశ్వతీర్థ స్వామి వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply