కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణోత్సవం

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణోత్సవం

పెద్ద ఎత్తున హాజరైన భక్తులు
ఆలయాల వద్ద భక్తులకు అన్న దానాలు


మక్తల్ , ఫిబ్రవరి 16 (ఆంధ్రప్రభ) : మహాశివరాత్రి పర్వదినం లో భాగంగా శివపార్వతుల కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి. మహా శివరాత్రి సందర్భంగా అర్థరాత్రి 12:00 లింగోద్భవ పూజలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో పాల్గొని మహాశివుడికి అభిషేకాలు నిర్వహించారు .సోమవారం కళ్యాణ వేడుకలు కన్నులపండువగా కొనసాగాయి. మక్తల్ మండలం లోని పసుపుల వద్ద పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన శ్రీ క్షేత్ర శ్రీ వల్లభ పురం దత్త క్షేత్రంతొ పాటు మక్తల్ పట్టణంలోని శ్రీ ఉమా మహేశ్వరాలయం ,శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం,శ్రీ కుంబేశ్వరాలయం లో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వేడుకలను ఘనంగా జరిపించారు.

దత్త క్షేత్రం లో అర్చకులు రాఘవేంద్ర శివపార్వతుల కల్యాణం జరిపించారు .పెద్ద ఎత్తున హాజరైన భక్తులు శివపార్వతులకళ్యాణం కనులవిందుగా తిలకించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాత నిరంజన ,నిత్య స్వరూపానంద స్వామి, దత్తక్షేత్రం ట్రస్టు ప్రధాన కార్యదర్శి రామలింగారెడ్డి,ట్రస్టు సభ్యులు పసుపుల దత్తు, తదితరులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ….

మక్తల్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం ఆలయ అర్చకులు తిప్పయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. బాల్చేడ్ శివరాజ్ జయంతి దంపతులు పాల్గొని భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణోత్సవ వేడుకను వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిపించారు.అనంతరం బాల్చేడ్ భీమన్న జ్జాపకార్థం అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాల్చేడ్ మల్లికార్జున్ ,మిఠాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఉమామహేశ్వరాలయంలో…..

మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో ఉమామహేశ్వరుల కళ్యాణం వేడుకను రుమాళ్ళ అపర్ణ రాజశేఖర్ దంపతులు కళ్యాణ వేడుకలను కన్నులపండువగా జరిగాయి. మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ అర్చకులు సిద్ధరామయ్య స్వామి ఆధ్వర్యంలో ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపించారు .అనంతరం అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయంలో ఉమామహేశ్వరుడికి భక్తులు అభిషేకం చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భజన కార్యక్రమాలను చేపట్టారు.

Leave a Reply