Makthal | ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది .ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది .అనేక పోలింగ్ బూత్ లలో ఓటర్ల రద్దీ కనిపించడం లేదు .అయితే 11వ వార్డు పరిధిలోని 25వ బూతు వద్ద ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు .ఉదయం 9 గంటల వరకు 15 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 16 వార్డులకు గాను 6వ వార్డు బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో అవార్డు ఎన్నికను ఎన్నికల అధికారులు రద్దు చేశారు .15 వార్డుల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
