రూ.ఒక వెయ్యి 35 కోట్లతో అభివృద్ధి చేస్తున్నందుకు ఓడిస్తారా..

రూ.ఒక వెయ్యి 35 కోట్లతో అభివృద్ధి తహచేస్తున్నందుకు ఓడిస్తారా..
బిజెపి బిఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టండి
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి
ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి
2: ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ లీడర్లు శ్రేణులు
మక్తల్ , ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ) : మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రెండేళ్లలో ఒకవేయి 35 కోట్ల రూపాయలు తీసుకువచ్చినందుకు మున్సిపల్ ఎన్నికల్లో తనను(కాంగ్రెస్ పార్టీని)ఓడగోడతారా అని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. 72 ఏళ్లలో 14 మంది ఎమ్మెల్యేలు 290 కోట్ల రూపాయలు మాత్రమే నియోజకవర్గానికి తీసుకువస్తే కొత్తగా ఎన్నికైన తాను రెండేళ్లలో ఒక వెయ్యి 35 కోట్ల రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి కుట్రలు కుతంత్రాలతో తనను ఓడగొట్టేందుకు బిజెపి బిఆర్ఎస్ కుట్రలు కురితంత్రాలు చేస్తున్నాయని వారి కుట్రలను ఎన్నికల్లో తిప్పి కొట్టాలని ఆయన మక్తల్ ప్రజలకు పిలుపునిచ్చారు .మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి పట్టణపుర వీధులగుఃడా నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు .

చివరగా అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీజేపీ బిఆర్ఎస్ నాయకుల పై నిప్పులు చెరిగారు. మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే బిఆర్ఎస్ బిజెపి నాయకులకు అభివృద్ధి జరగడం ఇష్టం లేదని అన్నారు. అందుకే బయట పోరాటం లోపల ఒకటిగా కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 130 కోట్లతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 50 కోట్ల రూపాయలతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం ,240 కోట్ల రూపాయలతో మక్తల్ నుండి నారాయణపేటకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. డయాలసిస్ రోగుల కోసం మక్తల్ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దన్నారు. విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల మక్తల్లో కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీ బిడ్డగా ఇంతగా అభివృద్ధి చేపడుతుంటే బీజేపీ బిఆర్ఎస్ నాయకులు సహించలేకపోతున్నారని అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు .తాను ఇక్కడే పుట్టా ఇక్కడే చనిపోతే ఇక్కడే ఖననం చేస్తారని నా తుది శ్వాస ఉన్నంతవరకు మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడతానని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగవని అభివృద్ధి ఆగదని అన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు మంత్రి పదవి ఊడగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. మక్తల్ ప్రజల ఆశీర్వాదంతో పడమటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి 16 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాల్సిందిగా మంత్రి వాకిటి శ్రీహరి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి.కె.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి. రవికుమార్ యాదవ్, మాజీ జడ్పిటిసి జి .లక్ష్మారెడ్డి మున్సిపల్ ఎన్నికల చైర్పర్సన్ అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తా తో పాటు 16 వార్డుల అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
