Makthal | రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ పథకం అమలు

Makthal | రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ పథకం అమలు

  • మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
  • సీఎం సహాయనిది చెక్కులను అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి సహాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం (సీఎంఆర్ఎఫ్) లక్ష్యమ‌ని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. అనారోగ్యాలతో ఆసుపత్రిపాలై ఆసుపత్రి బిల్లులు మోయలేని భారమైన సందర్భంలో ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవాళ‌ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మక్తల్ పట్టణంతో పాటు మండలంలోని 51మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్) పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదన్నారు. అనారోగ్యాలతో ఆసుపత్రిపాలైన సమయంలో ఆసుపత్రి బిల్లు రోగి కుటుంబాలకు మొయలేని భారం ఐన సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద బాధితులకు ఆర్థిక సాయం అందించడం సీఎంఆర్ ఎఫ్ లక్ష్యమన్నారు. ఆర్థిక సాయం వల్ల కుటుంబాలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోతాయన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా అందించే ఆర్థిక సాయం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందజేయనున్నట్లు చెప్పారు.

ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అయితే అనారోగ్యం బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు బిల్లులు తలకు మించిన భార‌మైన‌ సందర్భంలో వారికి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం పూర్తిగా పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అందించడమే తమ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, కావాలి మార్కెట్ డైరెక్టర్స్ ఫయాజ్, సాలంబిన్ ఉమర్ బస్రవి, మేదరి శ్రీనివాస్, నాయకులు గోలపల్లి నారాయణ, బోయ నరసింహ, మిస్కిన్ నాగరాజు, బి.శంషాద్దీన్, నూరుద్దీన్, ఉసామోద్దీన్, కావలి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply