Maktal | క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు..

Maktal | మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 21 వరకు నారాయణపేట జిల్లా కేంద్రం మినీ స్టేడియం లో జరిగిన 35వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బాల బాలికల ఖోఖో క్రీడా పోటీలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తరపున నారాయణపేట జిల్లా, జడ్పీహెచ్ఎస్ కర్ని విద్యార్థులు డి. అరవింద్, వి.నితిన్, బి. రేవతి, కె. రాధికలు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో బాలికల విభాగంలో రెండవ స్థానం సంపాదించారు.
అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ బాలుర జట్టు మూడవ స్థానం సాధించారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి.రూప తెలిపారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో గెలుపునకు క్రీడా ప్రతిభను చాటిన పాఠశాల విద్యార్థులను, అందుకు విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ బి. రూపను, జిహెచ్ఎం బి. వెంకటయ్య, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ రాధాదత్తురాం గ్రామ పెద్దలు అభినందించారు.
