హిందూ సమ్మేళనం విజయవంతం చేయండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈనెల 25న బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని ఊట్కూర్ ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ పాతపేట ఆంజనేయస్వామి దేవాలయంలో హిందూ సమ్మేళనం కరపత్రాలువిడుదలచేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ ధర్మం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు చాటిసపడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు హిందూ సమ్మేళనం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఊట్కూర్ మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం ప్రతి ఒక్కరు అదృష్టంగా భావించాలని దేశాన్ని విశ్వ గురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ పురాణపీఠం అనంత సాహితీ ఆశ్రమం శ్రీ స్వామి అనంతానంద భారతి, ముఖ్య వక్తగా అఖిలభారత కార్యాకారని భాగయ్య, అధ్యక్షులు విశ్రాంత ఉపాధ్యాయులు సిరిగిరి చందులాల్ ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున తరలిరావాలనికోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, విహెచ్ పి, శ్రీరామ కళ్యాణోత్సవం ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply