Telangana | పరుపుల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

Telangana | పరుపుల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

Telangana | మేడ్చల్, ఆంధ్రప్రభ : పరుపుల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి (Ghatkesar police station limits) లోని ఔషపూర్ లో చోటుచేసుకుంది. గురువారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషపూర్ గ్రామంలోని పరుపుల కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఘట్కేసర్ పోలీసులు (police), అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రూ.2కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply