Mahesh babu | ఆ ముగ్గురులో ఒకరితో మహేష్ నెక్ట్స్ మూవీ..?

Mahesh babu | ఆ ముగ్గురులో ఒకరితో మహేష్ నెక్ట్స్ మూవీ..?

వారణాసి తర్వాత మహేష్‌ నెక్ట్స్ మూవీపై ఆసక్తి
షూటింగ్ పూర్తయ్యాకే నిర్ణయం?
మహేష్ – సందీప్ రెడ్డి వంగా కాంబో ఫిక్స్ అవుతుందా?
రేసులో ప్రశాంత్ నీల్
అట్లీతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్?
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. ప్రస్తుతం వారణాసి అనే భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 2027 ఏప్రిల్ 7న ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక అక్కడ నుంచి మహేష్‌ నెక్ట్స్ మూవీ ఎవరితో అనే చర్చ అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మొదలైంది. ఇప్పుడు ముగ్గురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ.. ఆ ముగ్గురు దర్శకులు ఎవరు..? మహేష్ నెక్ట్స్ మూవీని నిర్మించే నిర్మాత ఎవరు…?

Mahesh babu | ఆతర్వాతే నిర్ణయం..

Mahesh babu

మహేష్‌ బాబు.. ఒక సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే.. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఫైనల్ చేస్తారు. అయితే.. ఇప్పుడు వారణాసి షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయ్యింది కానీ.. ఇంత వరకు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది కన్ ఫర్మ్ చేయలేదు. ఎప్పుడు కన్ ఫర్మ్ చేస్తారంటే.. వారణాసి షూటింగ్ పూర్తయ్యే వరకు నెక్ట్స్ మూవీ గురించి ఆలోచించకూడదనే నిర్ణయం తీసుకున్నాడట. జూన్ ఎండింగ్ కి వారణాసి షూటింగ్ పూర్తవుతుంది. ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. మహేష్‌.. తన వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చిత్రం ఎవరితో అనేది ఫైనల్ చేయాలి అనుకుంటున్నాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

Mahesh babu | మహేష్, సందీప్ రెడ్డి వంగా..

Mahesh babu

మహేష్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ అంటూ సందీప్ రెడ్డి వంగ పేరు గట్టిగా వినిపిస్తోంది. గతంలో మహేష్‌, సందీప్ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. ఇద్దరి మధ్య కథాచర్చలు జరిగాయి. అయితే.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఆతర్వాత మహేష్‌ తో మూవీ ఉండచ్చు అని ప్రచారం జరుగుతుంది. అయితే.. సందీప్ బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో యానిమల్ 2 చేయాలి కానీ.. ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వచ్చని.. అందుకనే మహేష్ తో సందీప్ సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది.

Mahesh babu | రేసులో ప్రశాంత్ నీల్, అట్లీ..

Mahesh babu

ఇక మిగిలిన ఇద్దరు దర్శకులు ఎవరంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ డైరెక్టర్ కూడా మహేష్‌ బాబుతో సినిమా చేయాలి అనుకున్నారు. గతంలో వీరిద్దరి మధ్య కూడా కథాచర్చలు జరిగాయి కానీ.. స్టోరీ సెట్ కాకపోవడం వలనో ఏమో కానీ.. కాంబినేషన్ కుదరలేదు. ఇప్పుడు హాంబలే ఫిల్మ్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మహేష్‌ బాబుతో సినిమాని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ పేరు కూడా వినిపిస్తుంది. అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ మహేష్ బాబుతో సినిమా నిర్మించేందుకు ట్రై చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, అట్లీ.. ఈ ముగ్గురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరి.. ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో మహేష్ నెక్ట్స్ మూవీ ఉంటుందో.. లేక వేరే డైరెక్టర్ తో ఉంటుందో తెలియాల్సివుంది.

Leave a Reply