Mahender | అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!

Mahender | నిజాంపేట, ఆంధ్రప్రభ : లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి నిజాంపేట గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పంజా మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామం పై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిని గ్రామాన్ని అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌న్నారు. గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. వీధిలైట్లు, డ్రైనేజీ, నీటి సమస్య, సీసీ రోడ‌క‌ల నిర్మాణాల కోసం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానన్నారు. నిజాంపేట గ్రామ ప్రజలు నన్ను ఆదరించి, అభిమానించి మీ ఆశీర్వాదాన్ని, మీ అమూల్యమైన ఓటును లేడీస్ పర్సు గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply