ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

భీమ్గల్ టౌన్, రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ పట్టణ కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో శనివారం సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ బీ.నాగమణి (స్వామి) పాల్గొని ఈ సందర్భంగా చైర్ పర్సన్, మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అపారమని కొనియాడారు. సమానత్వం, విద్యా హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మాట్లాడుతూ,పూలే ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.
సమాజంలో అసమానతలు తొలగించడంలో ఆయన చూపిన మార్గం ఎంతో ప్రాముఖ్యమైందని తెలిపారు.దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ, విద్యా రంగంలో సమాన అవకాశాలు కల్పించాలనే పూలే ఆలోచనలు నేటికీ ప్రస్తుతానికివేనని చెప్పారు. యువత ఆయన భావజాలాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు నిచ్చారన్నారు.
పూలే దళితులు, బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తుచేసుక యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్,మాజీ సర్పంచ్ రవి నాయక్,వార్డ్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యువత, పట్టణ గ్రామాల ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
