లాల్‌బ‌హదూర్ శాస్త్రికి కూడా…

ఉమ్మడి వరంగల్ ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ : గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ (Hanamkonda) జిల్లా కేంద్రం మ‌హాత్ముడికి ప‌లువురు నేతలు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అలాగే లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి (Lal Bahadur Shastri ) జ‌యంత్యుత్స‌వం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వర్ధన్నపేట శాసన సభ్యులు కె.ఆర్. నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి త‌దిత‌రులు మ‌హాత్మ గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి నేత‌ల చిత్ర ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

అనంతరం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు తౌటం రవీందర్, బి. అశోక్ రెడ్డి, రహీమున్నిసా బేగం, ఎస్.సి సెల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పి. రామకృష్ణ, మైనారిటీ జిల్లా అధ్యక్షులు మీర్జా అజీజుల్లా బేగ్, మాజీ కార్పొరేటర్లు నసీం జహాన్. సుంచు అశోక్, నాయిని లక్ష్మా రెడ్డి, హన్మకొండ రాజేందర్, నాయకులు ఎస్. అంకయ్య, టి.వీరన్న, ఇప్పా శ్రీకాంత్, సయ్యద్ అజ్గర్, మొహమ్మద్ జాఫర్, నల్ల సత్యనారాయణ, బండారి జనార్ధన్ గౌడ్, రవిప్రసాద్, టి. మేరీ, కే. రజనీకాంత్, ఎర్ర మహేందర్, ఎల్లయ్య, మండల సమ్మయ, వల్లపు రమేష్, పి. ఆంజనేయులు, మధు, యాసిన్, అంకుశావళి, మున్నీ, మహమ్మద్ నజీర్, వరుణ్, చేపూరి శ్యామ్, కందుకూరి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply