ముంబయి – బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu sood ) అందరికీ బాగా తెలుసు.. నటుడిగా (actor,) మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కోవిడ్ కాలంలో సోషల్ వర్క్ (Social work ) ద్వారా ప్రజలకు దేవుడయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఆయన సేవ కార్యక్రమాల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు . సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించే గొప్ప గుణం సోనూ సూద్‌ది. తాజాగా మరోసారి అతను తన గొప్ప దానగుణం చూపించారు. టుకుంటున్నాడు. అవసరం ఉంది అంటే చాలు ఆపద కన్నా ముందే ఉండి చేయూతనిస్తాడు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు సోనూసూద్. వివరాల్లోకి వెళితే.. ఓ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధ జంట ( Old couple ) పొలం దున్నుతూ(plunged dry land ) కనిపించారు. అయితే వారి వద్ద ఎద్దు లేకపోవడంతో పెద్దాయన ఎద్దులకు బదులు ఒక నాగలిని కట్టి వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఈ జంటకు ఎద్దులు కొనే ఆర్థిక పరిస్థితి కూడా లేనట్టు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియో పై తాజాగా సోను సూద్ స్పందిస్తూ వారికి భరోసా నిచ్చారు. సహాయం అందిస్తానని మాటిచ్చాడు.
ఇందులో భాగంగా వ్యవసాయం కోసం అవసరమైన పశువులను వారికి అందిస్తానని చెప్పాడు. అంతేకాకుండా రైతును సంప్రదించి ఒక జత ఎద్దులను ఇస్తానని హామీ ఇచ్చాడు. మీరు నాకు నెంబర్ పంపండి, నేను మీకు కావాల్సిన పాడి పశువులను పంపుతాను అని వీడియోకు ప్రతిస్పందిస్తూ రాశాడు.