కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి జరగబోయే టీడీపీ మహానాడుకు మంత్రులు కడపకు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు మహానాడు ప్రాంగణం వద్ద స్వయంగా పనులు చేపట్టారు. పార పట్టుకుని మట్టి పనులు చేశారు. తాను ఒక కార్యకర్తనే అనే విషయానే చెప్పకనే చెప్పారు. వర్షం వల్ల మహానాడు ప్రాంగణంలోకి నీళ్లు చేరాయి.
మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్ మంత్రి నిమ్మల ఈ విషయాన్ని గమనించి స్వయంగా పార పట్టి సభా ప్రాంగణంలో మట్టిని చదును చేశారు. మరోవైపు మంత్రి సవిత కూడా సైకిల్‌పై మహానాడుకు బయలుదేరారు. పార్టీ కార్యకర్తలతో కలిసి సైకిల్ తొక్కుతూ బయలుదేరారు .