సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలి…

సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలి…

నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్

కడెం, ఆంధ్రప్రభ: సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందించాలి అని బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్ రావులు, రామనాథ్, మరియు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమంలో భాగంగా శనివారం కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ తరగతుల్లో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ప్రసంగించారు.

రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, సంస్థ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ప్రజలతో సాన్నిహిత్యం వంటి అంశాలపై సమగ్ర మార్గనిర్దేశం అందించడం ముఖ్యమని తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ఈ శిక్షణకు ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు.

ఆ కార్యక్రమంలో భవిష్యత్ రాజకీయ, సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా కార్యకర్తలను తీర్చిదిద్దుతూ సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక బలమైన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, అంత్యోదయ సూత్రం మరియు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా పార్టీ కార్యకర్తలు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. కార్యకర్తలకు సంస్థ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం, ప్రజలతో సాన్నిహిత్యం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేయబడింది.

ఈ శిక్షణ కార్యక్రమంలో వక్తలుగా బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్ రావులు, రామనాథ్, మేడిశెమ్మే రాజు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు మాదిరే శ్రీనివాస్ బుర్ర, రమేష్, కొండేరి రమేష్, అంకం మహేందర్, కొంతం శంకరయ్య, బిజెపి మండలాల అధ్యక్షులు కాశి, వేణి, శ్రీనివాస్ యాదవ్, మధుసూదన్ రావు, ఐదు వెంకటేష్, పుప్పాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply