ఆలయంలో వైభవంగా అభిషేకాలు….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయం(Siddhirameshwar Temple)లో ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో గల మూలభావి నీటితో భక్తులు తలస్నానాలు చేశారు.
అనంతరం ఆలయంలో గల స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అభిషేకాలు(Abhishekal) నిర్వహించారు భక్తులతో ఆలయం కిటకిటలాడింది. పూజల అనంతరం పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

