మేడ్ ఇన్ ఇండియా..

- పైగా వరల్డ్ బెస్ట్ విస్కీ అవార్..
ఆంరప్రభ, బిజినెస్ డెస్క్ : మేడ్ ఇన్ ఇండియా.. సింగిల్ మాల్ట్ విస్కీ ‘ఇంద్రి’ (Indri) ప్రపంచ వేదికపై లిక్కర్ కింగ్ లకు కిక్ ఇచ్చింది. లాస్ వెగాస్‌లో ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ 2025లో, ‘ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2025 మార్సాలా కాస్క్ ఫినిష్ విస్కీ’ బెస్ట్ వరల్డ్ విస్కీ అవార్డు సాధించింది.
ఈ పోటీలో ఇంద్రి విస్కీ అత్యంత అద్భుత స్కోరును నమోదు చేసింది. 100కి ఏకంగా 99.1 పాయింట్లు సాధించింది. ఇది భారతీయ సింగిల్ మాల్ట్ విస్కీకి ఈ పోటీ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. 2023 లో కూడా ఇంద్రి ఇదే స్థాయి ప్రపంచ విజయాన్ని సాధించింది.
హర్యానాలోని హిమాలయ పర్వత ప్రాంతాలకు సమీపంలో ఉన్న పికాడిలీ డిస్టిలరీలో తయారైన ఈ ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీకి గొప్ప వారసత్వం ఉంది. 1953లో ప్రారంభమైన ఈ బ్రాండ్ ప్రయాణం, నేడు భారతదేశంలోని అత్యాధునిక మాల్ట్ డిస్టిలరీలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. అవార్డు గెలుచుకున్న ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2025.. మార్సాలా వైన్ క్యాస్క్‌లలో ప్రత్యేకంగా తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ విస్కీ ఇది.
