Madaram | సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి

Madaram | సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి
Madaram | మేడారం (మంగపేట), ఆంధ్రప్రభ : సమ్మక్క తల్లికి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి. మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం కాకతీయులతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజు, నాగులమ్మ తదితరలు భీకర యుద్ధం చేసిన సమయంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలుగా ఉండి అసమాన, ధైర్య, శౌర్య, పరాక్రమాలతో, త్యాగశీలంతో శతృవులతో రణం చేసి గొప్ప యుద్ధ వీరవనితగా పేరు తెచ్చుకుని చరిత్రకెక్కింది.
సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి నమ్మిన బంటుగా ఉండడంతో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి, గిరిజన, కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికే ఎక్కువ కీర్తి దక్కింది. అందుకే గట్టమ్మ తల్లిని కూడా గిరిజనులు దేవతగా మలుచుకుని గుడి కట్టి గట్టమ్మకు పూజలు చేస్తున్నారు.

