Madaram | చల్లంగా చూడు తల్లీ….

Madaram | మేడారం /మంగపేట, ఆంధ్రప్రభ : మేడారం మహాజాతర సందర్భంగా ఇవాళ మేడారం తరలివచ్చిన భక్తజనం మమ్ము చల్లంగా చూడు తల్లీ… అంటూ వనదేవతలకు మొక్కులు చెల్లించుకుని వేడుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన మేడారం జాతర శుక్రవారంకి మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు మేడారానికి తరలివచ్చారు. మొదట జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు పసుపు – కుంకుమ, కొబ్బరికాయ, బంగారం (బెల్లం ), ఒడి బియ్యం అమ్మవార్లకు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని తనువంతా తన్మయత్వమయ్యారు.
