Madaram | ఆర్టీసీ ప్రయాణం సురక్షితం ..

Madaram | ఆర్టీసీ ప్రయాణం సురక్షితం ..

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
  • మేడారంకు బస్సు సర్వీసులు ప్రారంభం

Madaram | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల దర్శనానికి వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం భూపాలపల్లి బస్టాండ్ లో డిపో మేనేజర్ ఇందూ తో కలిసి భూపాలపల్లి మేడారం బస్సు పాయింట్ ను జండా ఊపి ప్రారంభించారు.

Madaram

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ భూపాలపల్లి డిపో నుండి 80 సర్వీసులు మేడారం జాతరకు జరుపుతున్నామన్నారు. నాలుగు పాయింట్లు భూపాలపల్లి నుండి 40 బస్సులు , సిరోంచ 20, కాటారం 10 , కాళేశ్వరం 10 సర్వీసులు నడుస్తున్నాయన్నారు. భక్తులు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పరకాల భూపాలపల్లి డిపోలు సంయుక్తంగా చిట్యాల, గణపురం , రేగొండలో బస్సు పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాయని, మేడారం వెళ్లే భక్తులకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని భక్తులు అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు దేవన్, దాట్ల శ్రీనివాస్, జోగుల సమ్మయ్య, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply